దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో కో పైలట్ కత్తిపోట్లు
రిపోర్టర్: హరి
స్థలం: Tabuk
దుబాయ్ నుండి ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా కో పైలట్ కెప్టెన్‌పై కత్తితో దాడి చేశాడని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు, సిబ్బంది వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సహాయక విమాన సిబ్బంది జోక్యంతో బోయింగ్ విమానం సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు.