ఇజ్రాయెల్ కు అమెరికా ఆర్థిక సాయం బంద్: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

రిపోర్టర్: సునీల్ స్థలం: Washington

ఇజ్రాయెల్ కు ఏటా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా నిలిపివేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో నెలల క్రితమే ఈ ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఇకపై అమెరికా ఆర్థిక సాయం ఆ దేశానికి అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత ఒప్పందం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అమల్ లో ఉండటంతో ఈ ప్రకటనపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.