ఏపీ ఈసెట్ చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈసెట్ మూడో విడత లేదా చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 16న సీట్ల కేటాయింపు ఉంటుంది. అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.