శ్రీకాకుళంలో బాలికపై లైంగిక దాడి, వృద్ధుడికి రిమాండ్
రిపోర్టర్: గోపి
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం గుంజిలోవలో ఏడేళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు కవిటి రామారావు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి ఏడు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు.