మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ ప్రాంతంలో యువకుడి బీభత్స హత్య

రిపోర్టర్: రాము స్థలం: Sagar

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లా మక్రోనియా ప్రాంతంలో పాత కక్షల నేపథ్యంలో అంకిత్ పటేల్ అనే ఇరవై ఎనిమిదేళ్ల యువకుడిని ఓ వ్యక్తి ఇనుప పైపుతో కిరాతకంగా కొట్టి చంపినట్లు ఎస్పీ అనురాగ్ సుజానియా తెలిపారు. కేవలం పదహారు సెకన్ల వ్యవధిలో పద్నాలుగు సార్లు తలపై తీవ్రంగా కొట్టడంతో యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.