క్షణకాలం ఏమరుపాటుతో బావిలో పడి ప్రాణాలు కోల్పోయిన రైతు

రిపోర్టర్: హరి స్థలం: Kamareddy

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్‌ గ్రామానికి చెందిన ఎం.డి. నాజర్‌ అహ్మద్‌ (57) అనే రైతు పొలంలో మోటార్‌ స్టార్టర్‌కు మరమ్మతులు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. కరెంట్ పోయిందని భావించి స్టార్టర్ సరిచేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడటంతో హైవోల్టేజ్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి బంధువు మొహమ్మద్‌ ఫహీమ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.