స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిసారించిన ఏపీ కాంగ్రెస్ పార్టీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా చేసుకుని పూర్వవైభవం సాధించేందుకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీని క్షేత్రస్థాయిలో పునర్నిర్మించేందుకు 10 మంది సీనియర్ నేతలతో రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్. రఘువీరారెడ్డిని ఛైర్మన్ గా, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలంను కన్వీనర్ గా నియమించడం ద్వారా కాంగ్రెస్ తన పాత అనుభవజ్ఞులను మళ్లీ ప్రధాన స్రవంతిలోకి తెస్తోంది.