తిరుమలలో ఎస్వీ మ్యూజియం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
రిపోర్టర్: సురేష్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎస్వీ మ్యూజియం ప్రారంభంకానుంది. ఈ ఏర్పాట్లను తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు గురువారం పరిశీలించారు. మ్యూజియంలోని గ్యాలరీలను తనిఖీ చేసి అధికారులకు తగు సూచనలు జేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.