విజయవాడలో దారుణం: కన్న బిడ్డను నడివీధిలో వదిలేసిన నిర్భాగ్యురాలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయవాడ
భర్త మరణం, తీవ్ర పేదరికం కారణంగా కన్న బిడ్డను పోషించలేక ఇరవై రోజుల పసిగుడ్డును నడివీధిలో వదిలేసినట్లు మహిళ తెలిపారని పోలీసులు వెల్లడించారు. విజయవాడ మొగల్రాజపురంలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసిందని వారు పేర్కొన్నారు. సీసీటీవీ ఆధారంగా మహిళను గుర్తించి స్టేషన్కు తరలించగా, ఆమె కన్నీటిపర్యంతమై తన దయనీయ స్థితిని వివరించినట్లు అధికారులు స్పష్టం చేశారు. అనంతరం తల్లీబిడ్డలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.