భారత్లో ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకం: సీఈసీ జ్ఞానేశ్ కుమార్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: గుజరాత్
భారత్లో ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. గుజరాత్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా తయారీ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ పక్కాగా ధ్రువీకరణ ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల పరిశీలనతోనే ప్రపంచంలోనే అత్యంత పారదర్శక ఎన్నికల వ్యవస్థగా భారత్ నిలిచిందని పేర్కొన్నారు.