ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు భారీ షాక్: స్టీవ్ స్మిత్ ఫిట్నెస్పై సందిగ్ధత

రిపోర్టర్: గోపి స్థలం: కేప్‌టౌన్

ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మెడ నొప్పితో బాధపడుతున్నాడని, దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టులో అతని ఆడే అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్ వెల్లడించాడు. కేప్టౌన్ వేదికగా మంగళవారం ప్రారంభంకానున్న ఈ సిరీస్ నిర్ణయాత్మక చివరి మ్యాచ్లో స్మిత్ అందుబాటుపై చివరి నిమిషం వరకు వేచి చూస్తామని కమిన్స్ స్పష్టం చేశాడు. గీబేర్హాలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి పాలైన విషయం తెలిసిందే.