అనంతపురంలో వైఎస్ఆర్సీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై పోలీసులు నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో విధుల్లో ఉన్న పోలీసులపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుల్లో వెంటనే బెయిల్ పొందే అవకాశం లేకపోవడంతో ఆయన అరెస్ట్ ఎప్పుడైనా జరగవచ్చని ప్రచారం జరుగుతోంది.