కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు
రిపోర్టర్: రాము
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని తోల్కట్ట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ ముదిరాజ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్లే ప్రజలు, నాయకులు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.