భోగాపురం విమానాశ్రయ రవాణా సౌకర్యాలపై హైకోర్టు తీవ్ర ఆరా
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయనగరం
విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రజా రవాణా సరిగ్గా లేకపోవడంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. రాత్రి వేళల్లో విమానాల రాకపోకలకు తగ్గట్టు రవాణా సౌకర్యాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. విమానాల సమయాలు, కల్పించిన వసతుల పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.