మున్సిపల్ ఎన్నికలు: ఈ నెల 23న వైస్ చైర్మన్ల ఎన్నిక
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నగరపాలక సంస్థలు మరియు పురపాలక సంఘాల్ లో ఈ నెల ఇరవై మూడో తేదీన డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ఈ మేరకు పదో తేదీలోగా సభ్యులకు నోటీసులు జారీ చేసి పరోక్ష విధానంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన చీరాల పురపాలక సంఘం ఓట్ల లెక్కింపు ఆరో తేదీన ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది.