రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి చిన్నారి రోదన

రిపోర్టర్: హరి స్థలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సాయన్నపేట మూలమలుపు వద్ద బూడిద ట్యాంకర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఉమా అనే మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. గురుకులంలో చదువుతున్న పెద్ద కూతురును చూసేందుకు భర్త మోహన్, చిన్న కూతురు జైత్రతో కలిసి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తల్లి మృతి చెందగా, అపస్మారక స్థితిలో ఉన్న తండ్రిని లేపేందుకు చిన్నారి జైత్ర నీళ్లు చల్లుతూ చేసిన ప్రయత్నం అందరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.