'డీఎస్సీపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం': సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన ప్రభుత్వం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Amaravati
మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. టెట్ అర్హతలు మరియు స్పోర్ట్స్ సర్టిఫికెట్లకు సంబంధించి వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎలాంటి వదంతులను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు.