ట్రైన్లో సీటు వివాదం: కన్ఫర్మ్డ్ బెర్త్ ఇవ్వనన్న మహిళపై ప్రయాణికుడి ఆవేదన
రిపోర్టర్: సతీష్
స్థలం: Maharashtra
బాంద్రా నుండి అహ్మదాబాద్ వెళ్తున్న అమరాపూర్ ఆరావళి ఎక్స్‌ప్రెస్‌లో కన్ఫర్మ్డ్ లోయర్ బెర్త్ కోసం ఓ ప్రయాణికుడు తీవ్ర ఇబ్బంది పడ్డాడని బాధితుడు వెల్లడించాడు. తన సీట్లో కూర్చున్న మహిళ కుటుంబసభ్యుల కోసం సీటు మార్చుకోవాలని పట్టుబట్టిందని, ఇందుకు నిరాకరిస్తే తనపై కుటుంబసభ్యులంతా కలిసి దాడిలా వాదనకు దిగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెట్వర్క్ లేకపోవడంతో రైల్వే హెల్ప్‌లైన్‌ను సంప్రదించలేకపోయానని, టీటీఈ కూడా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యానని బాధితుడు వాపోయాడు.