పేదలకు మెరుగైన వైద్యం అందించడమే తన ధ్యేయమన్న అంకంరెడ్డి సౌమ్య
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో వైఎస్సార్సీపీ జడ్పీటీసి అభ్యర్థి అంకంరెడ్డి సౌమ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని, తండ్రి అంకంరెడ్డి జెమేలు ఆశయాలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు సేవ చేస్తున్నానని ఆమె తెలిపారు.