టెక్నాలజీ చరిత్రలో సరికొత్త మైలురాయి: అంతరిక్షంలో తొలి ఏఐ ప్రాంప్ట్ రన్
రిపోర్టర్: మహేష్
స్థలం: టెక్సాస్
అంతరిక్షంలో గూగుల్ సంస్థ మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ప్రాంప్ట్ ను విజయవంతంగా అమలు చేసినట్లు ప్రాజెక్ట్ సన్క్యాచర్ ఇంజనీర్లు వెల్లడించారు. కక్ష్యలో ఉన్న ప్రొటోటైప్ ఉపగ్రహం భూమి నుండి పంపిన ఆదేశాన్ని అందుకుని టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ఒక హైకు కవితను రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సంచలన ప్రయోగం ద్వారా భవిష్యత్తులో అంతరిక్ష ఆధారిత కంప్యూటింగ్ రంగంలో నూతన శకానికి నాంది పలికినట్లు గూగుల్ సంస్థ స్పష్టం చేసింది.