హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణపై ఎన్హెచ్ఏఐ చైర్మన్తో మంత్రి కోమటిరెడ్డి భేటీ

రిపోర్టర్: సురేష్ స్థలం: నల్గొండ

హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం ఎన్హెచ్-65 రహదారి విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతూ న్యూఢిల్లీలో ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ మరియు మెంబర్ ప్రాజెక్ట్స్ విపనేష్ శర్మలను కలసి చర్చించినట్లు మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ మార్గంలో పెరుగుతున్న రద్దీ మరియు నిత్యం జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.