అధికారుల తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: మేడ్చల్
అధికారులు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా మెకానికల్ గా పనిచేస్తే ఇబ్బందులు తప్పవని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల రెవెన్యూ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు ఫోన్ చేసినా స్పందించకపోవడం సరికాదన్నారు. హైదరాబాద్ శివార్లలో ఇళ్లపై ఆంక్షలు ఎత్తివేయాలని, పేదల ఇళ్ల కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేశారు.