గోదావరిఖని ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్న ఎంపీ వంశీకృష్ణ

రిపోర్టర్: T. SRAVAN స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బస్టాండ్ వెలుపల స్థానికులతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆత్మీయంగా మమేకమయ్యారు. ప్రజలతో కలిసి టీ తాగుతూ వారి సమస్యలు, స్థానిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను ఓపికగా విన్న ఎంపీ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.