జాతీయ రహదారిపై సైనిక హెలికాప్టర్ల విన్యాసాలు ప్రదర్శించిన భారత సైన్యం

రిపోర్టర్: నరేష్ స్థలం: రాజస్థాన్

భారత సైన్యం సరిహద్దు ప్రాంతంలో నిర్వహించిన జై సే విజయ్ విన్యాసాల్లో భాగంగా జాతీయ రహదారిని తాత్కాలిక రన్వేగా మార్చారు. సప్తశక్తి కమాండ్ ఆధ్వర్యంలో రుద్ర, ధ్రువ్, చేతక్ హెలికాప్టర్లు రహదారిపై విజయవంతంగా ల్యాండింగ్, టేకాఫ్ డ్రిల్స్ నిర్వహించాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. భవిష్యత్ యుద్ధ రంగ సవాళ్లను ఎదుర్కొనేందుకు, అత్యవసర పరిస్థితుల్లో సైనిక బలగాల కదలికలను వేగవంతం చేసేందుకు ఈ విన్యాసాలు ఎంతగానో దోహదపడతాయని అధికారులు స్పష్టం చేశారు.