మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని అల్లూరి పోలీసుల హెచ్చరిక
రిపోర్టర్: నరేష్
స్థలం: అల్లూరి సీతారామరాజు
గంజా మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు విద్య, ఉద్యోగం, కుటుంబ సంబంధాలు మరియు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అల్లూరి పోలీసులు వెల్లడించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా యువత ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తుకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వాట్సాప్ వేదికగా వచ్చే గిఫ్ట్, రివార్డ్, కేవైసీ అప్డేట్, అకౌంట్ బ్లాక్, జాబ్ ఆఫర్ వంటి తెలియని నకిలీ లింక్‌లను క్లిక్ చేసి సైబర్ మోసాల బిన పడొద్దని అల్లూరి పోలీసులు హెచ్చరించారు.