ట్రాఫిక్ ఇబ్బందుల తొలగింపునకు ప్రత్యేక లేన్ సిద్ధం చేస్తున్నామన్న సన్‌ప్రీత్ సింగ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఉద్యోగులు పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేపీహెచ్‌బీ నుంచి వేవ్‌రాక్ వరకు ఆర్టీసీ మరియు ఐటీ కంపెనీల బస్సుల కోసం ప్రత్యేక లేన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ మార్గంలో సాధ్యాసాధ్యాలపై ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, డీసీపీ శేషాద్రినిరెడ్డి, ఆర్టీసీ ఈడీ శ్రీధర్‌లతో కూడిన బృందం బస్సులో ప్రయాణించి ట్రయల్ రన్ నిర్వహించింది.