భక్తిశ్రద్ధలతో దస్తురాబాద్‌లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: దస్తురాబాద్
దస్తురాబాద్ మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వివిధ గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు గణనాథుడిని ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. డప్పులు, భజనలు, నృత్యాలతో యువత సందడి చేయగా.. మహిళలు ఉత్సాహంగా చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు.