విద్యుత్ ఘాతంతో షిప్ట్ ఆపరేటర్ మృతి: నెల్లూరు జిల్లాలో విషాదం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా రాపూరు మండలం వేపినాపిలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభంపై వీధి దీపాలు అమరుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కాంట్రాక్టు షిప్ట్ ఆపరేటర్ పి.రవి మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. ఈ అకస్మిక మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.