భారీ వర్షాలతో విజయవాడ అతలాకుతలం, విమానాలు రద్దు

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయవాడ

విజయవాడలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బందరు, ఏలూరు రోడ్లతో పాటు బెంజ్‌ సర్కిల్‌ పరిసరాల్లో నడుములోతు నీరు చేరింది. చెడ్డ వాతావరణం కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి మరియు దారి మళ్లించారు. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగిపోర్లుతుండటంతో అధికారులను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అప్రమత్తం చేశారు.