షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు గాయపడిన బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్

రిపోర్టర్: సునీల్ స్థలం: ముంబై

కౌన్ బనేగా కరోడ్పతి 18 షో షూటింగ్ సమయంలో జారిపడటంతో ఎడమ మోకాలికి గాయమైనట్లు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. తాజా ఎపిసోడ్లో సాధారణంగా నిలబడి ప్రారంభించాల్సిన ప్రసంగాన్ని, గాయం కారణంగా సీటులో కూర్చుని కొనసాగించినట్లు తెలిపారు. అయితే గాయం తీవ్రమైనది కాదని ప్రేక్షకులు ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనతో అభిమానులు కొద్దిగా ఆందోళన చెందగా, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.