దసరా శరన్నవరాత్రులు: జగన్మాత దివ్య దర్శనం టికెట్లు విడుదల చేసిన ఈవో

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయవాడ

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి భక్తుల కోసం ప్రత్యేక దర్శన టికెట్లను దేవస్థానం ఈవో వీకే శీనా నాయక్ విడుదల చేశారని అధికారులు తెలిపారు. జగన్మాత దివ్య దర్శన్ పేరుతో ఒక్కో టికెట్ ధరను వేయి రూపాయలుగా నిర్ణయించామని పేర్కొన్నారు. అక్టోబర్ పదకొండు, పన్నెండు, పదమూడు తేదీల్లో దర్శనం కోసం మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.