తెనాలిలో విషాదం: ప్రముఖ గుండెజబ్బుల నిపుణులు డాక్టర్ దక్షిణామూర్తి కన్నుమూత

రిపోర్టర్: సురేష్ స్థలం: తెనాలి

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తొలితరం గుండెజబ్బుల చికిత్సా నిపుణుడిగా అపార ఖ్యాతి గడించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి అనారోగ్యంతో మంగళవారం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. తెనాలిలో గీతా నర్సింగ్హోంను ఏర్పాటు చేసి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించిన ఆయన పేదల వైద్యుడిగా విశేష మన్ననలు అందుకున్నారు. ఆయన మృతిపట్ల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.