తుర్కయంజాల్ మాసబ్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Rangareddy
ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్ మాసబ్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ, పోలీస్, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు మాసబ్ చెరువులో సుమారు 2,300 విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు పేర్కొంటూ, భక్తులు అధికారులు సహకరించి వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.