ప్రాక్టీస్ సెషన్ లో గాయపడిన భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
వెస్టిండీస్ తో సిరీస్ కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ కు గాయమైనట్లు మేనేజ్ మెంట్ తెలిపింది. పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన బౌన్సర్ కుడి మోచేతికి తగలడంతో గిల్ తీవ్ర నొప్పితో విలవిల్లాడినట్లు అధికారులు పేర్కొన్నారు. వెంటనే స్పందించిన వైద్య బృందం ప్రథమ చికిత్స అందించడంతో ప్రమాదం తప్పిందని, గిల్ కోలుకున్నట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి.