నెల్లూరులో పడిపోయిన పోలింగ్ శాతం: వలస ఓటర్లు రాకపోవడమే అసలు కారణం
రిపోర్టర్: అశోక్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా కోవూరు ప్రాంతంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ శాతం భారీగా తగ్గడానికి వలస ఓటర్లు స్వగ్రామాలకు రాకపోవడమే ప్రధాన కారణమని స్థానిక విశ్లేషకులు స్పష్టం చేశారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల నుంచి ఉపాధి నిమిత్తం వెళ్లిన వారు రాలేదని, అలాగే అభ్యర్థులు వారిని రప్పించే ప్రయత్నం చేయకపోవడంతో పాటు వర్షం కూడా ఆటంకం కలిపించిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.