పర్యావరణ పరిరక్షణకై మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్న ట్రస్ట్
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా గత పదకొండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆమనగల్ సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా తెలిపారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల పట్టణంలోని పాల శీతలీకరణ కేంద్రం వద్ద శనివారం ఉదయం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా సహజ మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించాలని పిలుపునిచ్చారు.