తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల ఫలితమే రాష్ట్రమని తెలిపిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదాద్రి భువనగిరి
యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ సాధన కోసం అనేక మంది ఉద్యమకారులు తమ ప్రాణాలను, సమయాన్ని ధారపోశారని తెలిపారు. ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని, వారి సేవలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు.