మహారాష్ట్రలో వీధి కుక్కల బెడదపై నిరసనగా అధికారుల టేబుల్‌పైకి కుక్కపిల్లలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాద్ నగర పంచాయతీ కార్యాలయంలో వీధి కుక్కల బెడదను నిరసిస్తూ యువసేన జిల్లా చీఫ్ విక్రమ్ రంధావే ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ మూటలో తెచ్చిన చిన్న కుక్కపిల్లలను చీఫ్ ఆఫీసర్ ధీరజ్ భామ్రే టేబుల్‌పై వదిలారు. ఈ ఘటనపై అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.