అక్రమ పట్టా మార్పిడి వ్యవహారంలో ఉప్పునుంతల తహసీల్దార్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి గ్రామంలోని సర్వేనెంబర్ 115 లో భూమిని ఇతరులపై అక్రమంగా పట్టా చేయడంపై జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన తాసిల్దార్ సునీతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ విధుల్లో ఎవరైనా సరే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.