ఢిల్లీలో శాంతియుత నిరసనలపై పోలీసుల దాడులు: రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రాజేష్
స్థలం: New Delhi
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న దేశ యువతపై పోలీసులు, బీజేపీ గూండాలు దాడులకు పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనలో యువతపై దౌర్జన్యం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఇది తాము కోరుకుంటున్న భారతదేశం కాదని స్పష్టం చేశారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ, అందరం కలిసికట్టుగా సుప్రీంకోర్టుకు మార్చ్ నిర్వహిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.