ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం: బేతుపల్లి చెరువులో గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది
రిపోర్టర్: సతీష్
స్థలం: ఖమ్మం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువులో మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన పది మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తున్న రెండు బోట్లు తిరగబడ్డాయని అధికారులు తెలిపారు. నీటి ప్రవాహం మరియు గాలి ధాటికి బోట్లు బోల్తా పడటంతో సిబ్బంది గల్లంతయ్యారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనపై ఆరా తీసి వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారని స్థానికులు మరియు అధికారులు వెల్లడించారు.