గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హుస్నాబాద్
గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని పలు గణేష్ మండపాలను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఆర్టీసీ బస్ డిపో కాలనీ, హనుమాన్ నగర్లలో ఏర్పాటు చేసిన మండపాలలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి ఆకాంక్షించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.