కరీంనగర్‌లో రాజకీయ అండదండలతో అడ్డగోలుగా సాగుతున్న గ్రానైట్ తవ్వకాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కరీంనగర్

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పచ్చని వాతావరణం, జీవ వైవిధ్యానికి నిలయమైన గుట్టలు, కొండలు గ్రానైట్ మాఫియా ధన దాహానికి కరిగిపోతున్నాయి. కొత్తపల్లి, గంగాధర, బావుపేట, ఆసిఫ్‌నగర్, రాఘవాపురం, పెద్దపల్లి, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో నిబంధనలను బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తున్నారు. పర్యావరణ చట్టాలు, మైనింగ్‌ నిబంధనలు కాగితాలకే పరిమితం కాగా.. అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక బలమైన రాజకీయ అండదండలున్నాయనే తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.