నిడదవోలులో తొమ్మిది కోట్ల నూతన రోడ్లకు మంత్రి దుర్గేష్ శంకుస్థాపన
రిపోర్టర్: రమేష్
స్థలం: తూర్పు గోదావరి
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పందలపర్రు గ్రామంలో సుమారు తొమ్మిది కోట్ల నూతన రోడ్ల నిర్మాణ పనులకు పర్యాటక శాఖ మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. నిడదవోలు రూరల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా స్థానిక గ్రామీణ ప్రాంత ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగిపోయి, మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.