అక్రమ క్వారీ పేలుళ్ల జ్వాలల్లో చితికిపోతున్న పేదల ఇళ్లు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వడమాలపేట

వడమాలపేట, నగరి నియోజకవర్గాల్లో గత ప్రభుత్వ హయాంలో అనుమతులు పొందిన మైనింగ్ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు జరుపుతున్నారంటూ నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించిన బ్లాస్టింగ్ల వల్ల సమీపంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల ఇళ్లు దెబ్బతింటున్నాయని ఆయన వాపోయారు. మైనింగ్, విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసిన ఎమ్మెల్యే, నిబంధనలు ఉల్లంఘించే క్వారీలపై కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. ప్రజల ఇళ్లకు నష్టం వాటిల్లితే సహించేది లేదని, బాధ్యులపై చట్టపరంగా ముందుకు వెళ్తామని తేల్చిచెప్పారు.