కుల వివక్షతను ఎదిరించి నిలిచిన ద్రావిడ ఉద్యమ సూర్యుడు పెరియార్

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పూలే-పెరియార్-అంబేద్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో ద్రావిడ ఉద్యమనేత పెరియార్ ఈ.వి. రామసామి 147వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహనీయుల విగ్రహాల వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వేదిక అధ్యక్షులు గొడిసెల శ్రీహరి మాట్లాడుతూ కుల, మత, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పెరియార్ చేసిన పోరాటం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమన్నారు. స్త్రీలకు సమాన హక్కులు, స్వేచ్ఛ కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.