అయ్యప్ప సొసైటీ భూముల అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డిపై కల్వకుంట్ల కవిత నిప్పులు
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ లోని అయ్యప్ప సొసైటీ భూములను ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కామధేనువుగా వాడుకుంటూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బంజారా హిల్స్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నెల రోజుల్ లో అక్రమ భవనాలపై చర్యలు తీసుకోకపోతే తామే స్వయంగా వెళ్లి రెడ్ మార్క్ వేస్తామని ప్రభుత్వానికి ఆమె అల్టిమేటం జారీ చేశారు.