'5 స్థానాలు.. 50 మందికి పైగా పోటీ!': ఎమ్మెల్సీ రేసుపై కాంగ్రెస్ కసరత్తు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో సుమారు యాభై మందికి పైగా నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. గవర్నర్ కోటాలో మూడు, గ్రాడ్యుయేట్ కోటాలో రెండు స్థానాల భర్తీ కోసం ఆశావహులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆశీస్సులతో పాటు అధిష్టాన పెద్దల వద్ద లాబీయింగ్ మొదలుపెట్టారు. సామాజిక సమీకరణలతో పాటు గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుండటంతో, అసెంబ్లీ సమావేశాల ముగిసిన వెంటనే అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు ప్రారంభం కానుంది.