అమెరికాలో లక్షా నలభై వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఎస్సార్ గ్రూప్

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమెరికా

అమెరికాలో భారత్కు చెందిన ప్రముఖ ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టనుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యూఎస్లోని అయోవా రాష్ట్రంలో ఉక్కు కార్మాగార నిర్మాణానికి మొసాబి మెటాలిక్స్ ద్వారా పదిహేను బిలియన్ డాలర్ల మేర సమకూర్చనున్నట్లు తెలిపారు. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉక్కు పరిశ్రమ అని, దీని ద్వారా ప్రతి ఏటా పది మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి కానుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.