రక్తదానంతో ప్రాణాలు నిలుపుతున్న యువత స్ఫూర్తిదాయక సేవలు
రిపోర్టర్: RAMESH LAVETI
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ కంది వెంకటరమణ మరియు కమిటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతం చేస్తున్నట్లు సీనియర్ నాయకులు లావేటి రమేష్ తెలిపారు. సాధన యువజన సేవా సంఘం అధ్యక్షులు పోలుబోతు దుర్గా ప్రసాద్ ఏకంగా 70వ సారి రక్తదానం చేసినట్లు ఆయన మీడియాకు వివరించారు. సమాజంలో ఇటువంటి సేవలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయని, యువత స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.